what is first touch mobile device in india ?


ఇప్పుడంటే ప్రతీ ఒక్కరూ టచ్ స్క్రీన్ ఫోన్లని వాడుతున్నారు గానీ, 2004లో మొదటి తరం టచ్ స్క్రీన్ ఫోన్ అయిన Sony Ericsson P900 మోడల్ ని రూ. 35,000 పెట్టి కొన్నాను.

Symbian UIQ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఆ ఫోన్ పై నేను చేయని ప్రయోగమంటూ లేదు. "కంప్యూటర్ ఎరా" తెలుగు మేగజైన్ లో 2004 సంవత్సరం నుండే "సెల్ కాలమ్" అనే ఓ ప్రత్యేకమైన కాలమ్ ని మొదలుపెట్టడానికీ ఇన్ స్పిరేషన్ ఈ ఫోనే.

ఆ తర్వాత P900 వల్ల బాగా ఇంప్రెస్ అవడంతో Sony Ericsson P990i అనే మోడల్ నీ 2007-2008 సంవత్సరంలో వాడాను.

ఈ రెండు ఫోన్లనీ పై ఈ వీడియోలో చూడవచ్చు. 2004లో కొన్న Sony Ericsson P900 ఏడు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ బ్యాటరీ బ్యాకప్ తగ్గకపోవడం దాని బ్యాటరీ నాణ్యతకు నిదర్శనం.

అలాగే ఆ ఫోన్లు ఎన్నిసార్లు ఎంత ఎత్తు నుండి కింద పడ్డాయో చెప్పలేను, అయినా ఇప్పటికీ చెక్కు చెదరకపోవడాన్ని మీరు ఈ వీడియోలో గమనించవచ్చు.

ఈ ఫోన్ విడుదలకు సంబంధించిన వివరాలు వికీపీడియాలో ఈ లింక్ లో చూడవచ్చు:







- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Post a Comment

Whatsapp Button works on Mobile Device only