Hot Posts

6/recent/ticker-posts

Ad Code

Wedding banners

how to set dual OS in android tablets ?





కొన్ని రోజుల క్రితం "Akash, Ubislate 7 వంటి నాసిరకం ఉత్పత్తులపై విపరీతమైన మోజు పెంచుకోవద్దు" అని చెబుతూ, కొన్ని నెలలు వేచి చూస్తే మంచి కంపెనీల, నాణ్యత, మంచి పనితీరు కలిగిన టాబ్లెట్లు చవక ధరలకే అందుబాటులోకి వస్తాయన్న దానికి ఉదాహరణగా HP Touch Pad 32 GB టాబ్లెట్ ని http://www.youtube.com/watch?v=NsNnzylHDGI అనే వీడియోలో చూపించాను.

ఈ టాబ్లెట్ ఆఫర్ లో 99 డాలర్లకు (అంటే 4 నెలల క్రితం అప్పటి ధర ప్రకారం రూ. 5,000 లోపు) లభించింది.

ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత చాలామంది "అందులో Web OS మాత్రమే ఉంటుంది కదా, ఆండ్రాయిడ్ లేనప్పుడు వృధా కదా" అంటూ పెదవి విరిచారు.

ఒక మామూలు కంప్యూటర్ నే తీసుకుంటే దానిలో విండోస్, Linux ఇలా ఏ OS నైనా వేసుకోవచ్చు. అలాగే టాబ్లెట్లలోనూ మనకు నచ్చిన OSని వేసుకోవడానికి పద్ధతులు ఉంటాయి.

దీన్ని నిరూపించడానికే నేను పై వీడియోలో చూపించిన టాబ్లెట్ లో Android ఆపరేటింగ్ సిస్టమ్ ని వేసి, దాని ఫొటోలు ఇక్కడ అందిస్తున్నాను.

ఇకపోతే "HP కంపెనీ ఆ ప్రోడక్ట్ ని నిలిపివేసిందట", "ఇండియాలో దొరకట్లేదు" అంటూ సందేహాలు వ్యక్తం చేసిన వారికి నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే.. నేను ఈ టాబ్లెట్ ని రివ్యూ చేసింది కేవలం "ఆకాష్, Ubislate 7లకు దేశీయ బ్రాండింగ్ పులిమి, సామర్థ్యానికి మించి నెత్తికి ఎక్కించుకుంటున్న ప్రభుత్వ ధోరణినీ, ప్రజల అవగాహనా లేమినీ" కొద్దిగా విజ్ఞులైన వారి దృష్టికి తెస్తూ.. కొన్నాళ్లు వేచి చూస్తే నేను వీడియోలో చూపించినటువంటి నాణ్యమైన టాబ్లెట్లు అతి చవక ధరలకే రావడం ఖాయం అన్నది తెలియజెప్పడానికి మాత్రమే.



- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Post a Comment

0 Comments

Ad Code