మీ Facebook అకౌంట్‌ని మీకేదైనా అయితే ఇతరులకు అప్పజెప్పడం ఎలా? Must Watch & Share
మనం నిండు నూరేళ్లు బ్రతుకుతాం :) అయితే దురదృష్టవశాత్తు అనుకోనిది ఏదైనా అయితే మీ Facebook అకౌంట్‌లో మీ తరఫున మీ కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని ప్రకటించాలంటే కుదరదు కదా? ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అవడం ద్వారా మీరు ఏదైనా అయితే మీ Facebook యూజర్ నేమ్, పాస్‌వర్డ్ తెలీకపోయనా మీరు ఎంచుకున్న ఒక వ్యక్తి మీ తరఫున విషయం update చేసే విధంగానూ సెట్ చేసుకోవచ్చు.
ఇలా మీరు ఎంచుకున్న వ్యక్తి మీ పర్సనల్ మెసేజ్‌లు చూడలేరు, మీరు గతంలో చేసిన పోస్టులు, వీడియోలు, ఫొటోలు తొలగించలేరు, మీ ఫ్రెండ్స్‌ని తొలగించలేరు. మీ పూర్తి ప్రైవసీ మరణం తర్వాత కూడా కాపాడబడుతుంది. సో ఈ శక్తివంతమైన, తప్పనిసరిగా ప్రతీ ఒక్కరూ సెట్ చేసుకోవాల్సిన ఆప్షన్‌ని ఈ వీడియోలో చెప్పినట్లు కాన్ఫిగర్ చేసుకోవచ్చు.
గమనిక: Facebook వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
0 Comments