డ్రింక్, స్మోకింగ్ మానేయాలనుకుంటున్నారా? ఈ టిప్స్ ఫాలో అవండి - Must Share

తాగడం ఎంత రిస్కో ఇంతకముందు పోస్టులో కొంత వివరంగా పేర్కొన్నాను. డ్రింక్ చేయడం మానేయాలని కొంతమంది ట్రై చేసీ ఫెయిలవుతుంటారు. ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్ ఫాలో అయితే ఖచ్చితంగా ఒక్క రోజులో డ్రింక్ మానేస్తారు.
బాగా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు తాగాలనిపిస్తుంది. సాయంత్రం పూట 9 నుండి మొదలెట్టి 11, 12 గంటల వరకూ తాగే వారికి ఈ విషయం బాగా తెలుసు. సహజంగా నైట్ 8 నుండి 9 వరకూ ఆకలి బాగా వేస్తుంది. అలా ఆకలిగా ఉన్నప్పుడు మందు టేస్టు గుర్తొస్తుంది.. నాలుక జివ్వుమంటుంది..
డ్రింక్ మానేయాలనుకున్న వారు దీన్ని బ్రేక్ చేస్తే సరిపోతుంది. ఆకలి వేస్తోందంటే దాన్ని ఆహారంతో నింపితే ఇక తాగబుద్ధి కాదు.. ఆకలిని మందుతో నింపుతున్నంత కాలం.. అలా మందు తాగుతూ ఏ చికెన్ ముక్కలో, చిప్స్ ముక్కలో తింటూ ఆకలి తీరుతోందని భ్రమిస్తున్నంత కాలం మీరు మందు మానేయలేరు.
మీకు నిజంగా మందు మానేయాలని ఉంటే ఈరోజే మానేయడం మొదలెట్టండి. నైట్ 8 గంటల కల్లా డిన్నర్ చేసేయండి. కడుపు ఫుల్ అయితే తాగాలన్న కోరికే కలగదు, ఒకవేళ మళ్లీ ఏ 10, 11 గంటలకో కొద్దిగా కడుపు ఖాళీ అయి ఆకలి వేసి తాగాలనిపిస్తే మళ్లీ ఏదో ఒకటి తినండి, ఖచ్చితంగా ఈరోజు మీరు మందు తాగకపోయినా ఏదో నష్టపోయిన ఫీలింగ్ ఉండదు, మీకు మీరు గుర్తు చేసుకుని క్రియేట్ చేసుకుంటే తప్ప! అలా గుర్తు చేసుకోకుండా ఎటూ న్యూ ఇయరే కాబట్టి మందు పార్టీలకు దూరంగా మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో స్పెండ్ చేయండి. వాళ్లతో టైమ్ గడుపుతుంటే మీకు టైమ్ తెలీదు. సో సక్సెస్‌ఫుల్‌గా మొదటి రోజు మందు మానేయగలుగుతారు.
ఇక రేపటి నుండి సేమ్ టూ సేమ్.. ఆకలి వేసిన వెంటనే గుర్తు రావలసింది ఫుడ్... వెంటనే ఏదో ఒకటి తినేయండి.. నాలుగు రోజులు అలా మనస్సు మళ్లించుకునీ.. ఆల్కహాల్‌ని కోరుకునే శరీరాన్ని మంచి ఆహారంతో సంతృప్తి పరిస్తే ఇక లైఫ్‌లో మీరు డ్రింక్ పట్టుకోరు.
సినిమాల వల్లో ఇంకే కారణాల వల్లో డ్రింక్ చేసే వాళ్లు ఇప్పుడు హీరోల్లా కన్పిస్తున్నారు గానీ డ్రింక్ చేసే వాళ్లు ఎప్పుడూ విలన్లే. తన ఆరోగ్యాన్నీ, తమ ఫ్యామిలీ శ్రేయస్సునీ పట్టించుకోక బాధ్యతారహితంగా ప్రవర్తించే అసలు సిసలు విలన్లు. డ్రింక్‌ని లీగలైజ్ చేసి.. దాన్ని గొప్ప హాబిట్‌గా అన్ని సీన్లలో ఇరికించేసిన సినిమా ఫీల్డ్‌లో కూడా గత కొన్నేళ్లుగా చిన్న వయస్సులోనే చనిపోతున్న అనేకమంది విపరీతంగా డ్రింక్‌కి అలవాటు అయి ఆరోగ్యాలు చెడగొట్టుకుని జీవితాలు ముగించేసిన వాళ్లే.
"తాగొచ్చావా" అని హీరోయిన్ అంటే.. హీరో కవర్ చేసుకుంటే.. హీరోయిన్ దాన్ని పసిగట్టి.. ఏమీ చెయ్యలేక ఓ నిట్టూర్పు విడిస్తే.. ఆ సీన్లు చూసే మందుబాబులు థియేటర్లలో నవ్వుకుంటూ ఉంటారు. అంతకన్నా ఎవరూ మనల్ని క్వశ్చన్ చెయ్యలేరన్న ధీమా. నువ్వు తాగుతుంటే సినిమాలో హీరోయిన్ అయినా, ఇంట్లో నీ పెళ్లామైనా, మీ అమ్మా నాన్నయినా ఎవరూ గట్టిగా నిలదీయలేరు.. కారణం నీ పట్ల వాళ్లకు ఉన్న ప్రేమ. ఆ ప్రేమని ఆసరాగా చేసుకుని తాగడం నీ దిగజారుడుతనం.
ఇకపోతే స్మోకింగ్ మానేయాలనుకునే వాళ్లూ ఫస్ట్ సిగిరెట్ పాకెట్ ని విసిరేయండి.. సిగిరెట్ తాగాలన్పించినప్పుడల్లా ఓ లీటర్ వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకుని తాగగలిగినంత వాటర్ ఫుల్ తాగేసేయండి. అస్సలు సిగిరెట్ పట్టుకోబుద్ధి కాదు. సిగిరెట్ తాగపోతే బాత్రూమ్ రాదనో, ఫుల్ భోజనం చేశాక సిగిరెట్ తాగాలనో అన్పించే chainsని కట్ చేసుకోండి. అలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడల్లా వాటర్ తాగడమే.. అది బెస్ట్ సొల్యూషన్ సిగిరెట్ మానేయడానికి!
చివరిగా ఒక్కమాట.. నాకున్న 22,000 మంది ఫ్రెండ్స్, ఫాలోయర్స్‌లో పైన నేను రాసిన మాటలు విని ఒక్కరైనా ఈరోజు నుండి డ్రింకింగ్, స్మోకింగ్ మానేస్తే నా తాపత్రయం ఫుల్ ఫిల్ అయినట్లే.
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
Sridhar Nallamothu

Post a Comment

Whatsapp Button works on Mobile Device only