ఆ మనిషంటే చాలా గౌరవం.. ఆ మనిషి అలా ప్రవర్తిస్తాడని నేనూహించలేదు

ఆ మనిషంటే చాలా గౌరవం.. ఆ మనిషి అలా ప్రవర్తిస్తాడని నేనూహించలేదు.. ఏళ్ల తరబడి ఉన్న ఓపీనియన్ మొత్తం కొట్టుకుపోయింది.. "మనుషులు ఇలా కూడా ఉంటారా?".. ఆ చులకన నవ్వు తలుచుకుంటే మనిషి మొహం మళ్లీ చూడాలన్పించట్లేదు..
"ఇన్నాళ్లూ ఎంత నటించాడూ.. చాలా ఆప్తుడైనట్లు చాలా ప్రేమగా మాట్లాడే మాటల్తో? లోపలున్న ఎమోషన్లని దాచుకుంటూ పైకి ఫేస్ చాలా ప్రేమగా పెడుతుండే వాడన్నమాట.. ఓ చిన్న నవ్వుతో, ఫేస్ ఎక్స్‌ప్రెషన్ తో మొత్తం బయటపడిపోయింది.. "
ఇలా నాలో నేను చాలా అనుకుంటూనే ఉన్నాను..
అంతే.. ఉన్న ఫళంగా ఓ మనిషిపై నా ప్రేమా, గౌరవం మొత్తం ఆవిరైపోయాయి.. లైఫ్ లాంగ్ ఆ మనిషి నా దృష్టిలో అతి సామాన్యుడే..
--------------------
పైన రాసింది నా విషయం కాదు.. అందరి ఆలోచనా తీరు..
ప్రతీదీ స్కానింగ్ చేస్తాం మనం.. మన వ్యక్తి అనుకోవాలంటే చాలా అర్హతలు కావాలి వాళ్లకు.. మన మీద మనకు చాలా నమ్మకం.. "మనం అంత ఈజీగా ఎవర్నీ నమ్మం.. ఎంటర్‌టైన్ చెయ్యం" అని!
ఒక్కటంటే ఒక్క లోపం కూడా ఉండకూడదు.. Mr. Prefectలా ఉండాలన్నమాట.. అలాగైతేనే వాళ్లు మనోళ్లు.. లేదంటే వాళ్లున్నా లేకపోయినా ఒకటే.. అవసరమే లేదనేస్తాం..
ఎవడి బలహీనతలు వాడివి.. ఓ మనిషి పట్ల నీకు వల్లమాలిన respect ఉందంటే అది నీ ఇమాజినేషన్.. కొంత అవతలి మనిషి గొప్ప బిహేవియర్..
ఉన్నతమైన బిహేవియర్ ఉన్నంత మాత్రాన ఛైల్డిష్ థాట్సూ, ఎక్స్‌ప్రెషన్లూ, సిల్లీ బిహేవియరూ, అపరిపక్వ ఆలోచనలూ ఏదో విషయంలో, ఎప్పుడోసారి ఉండకూడదు అని రూలేం ఉంది?
ఎగ్జాంపుల్.. నేను ఏదైనా బాగా ఆలోచిస్తానని నాకు దగ్గరగా వచ్చిన అనేకమంది మిత్రులు "ఏంటి సర్.. మీరు కూడా సిల్లీగా అందర్లా ఆ సినిమా చూస్తున్నా.. ఈ సినిమా చూస్తున్నా అని updates పెడతారు" అంటూ సున్నితంగా హెచ్చరిస్తుంటారు. వాళ్లకు నా బిహేవియర్‌లోని contrast నచ్చట్లేదు. నాకు సినిమాలు ఇష్టం.. సో పెడుతుంటాను.. నాకు క్లారిటీ ఉంది. క్లారిటీ మిస్ అయ్యేది కంప్లయింట్లు చేసే మిత్రులకే!
ఎప్పుడూ ఓ మనిషిని ఓ మూసలో చూడడం కరెక్ట్ కాదు. రకరకాల compositions కలిస్తే ఓ పర్‌ఫెక్ట్ మెడిసిన్ ఎలా తయారవుతుందో మనిషీ ఎప్పుడెలా బిహేవ్ చేస్తారో, దేనికెలా స్పందిస్తారో మనకు తెలీదు. మనిషి బిహేవియర్‌లో మనకు నచ్చనిది ఏదైనా కన్పించగానే "నీ మీద ఉన్న respect మొత్తం పోయింది..." అని మొహం ముడుచుకుంటే అసలు అది నిజంగా, బలంగా ఇన్నాళ్లూ మీరు ఇచ్చిన గౌరవమేనా ఆ మనిషికి? అంత బలమైన గౌరవం ఆ మనిషి ఓ చిన్న different shadeతోనో, బిహేవియర్‌తోనో పోతుందా?
నాకు చంద్రబాబు ఇష్టం, పరకాల ప్రభాకర్ ఇష్టం.. వీళ్లిద్దరి గురించీ గొప్పగా చెప్పిన రోజున ఓ మనిషి అన్నాడు.. "మీరంటే చాలా respect ఉండేదండీ.. ఈరోజుతో అది పోయింది" అని! హహహ అరే నాయనా.. ఒక్కటి చెప్పు.. నా మీద నీకు respect ఎందుకు క్రియేట్ అయింది? ఫస్ట్ అది క్లారిటీ తెచ్చుకో..?
"నల్లమోతు శ్రీధర్ టెక్నాలజీ షేర్ చేస్తాడు.. మంచి మాటలు చెప్తాడు.." అని నువ్వు నన్ను గౌరవించడం మొదలెట్టావు.. అంతే కదా...?
మరి ఈరోజు నేను చంద్రబాబునో, పరకాల ప్రభాకర్‌నో ఇష్టపడడం వల్ల నేను నీకు చేసే ఏ పనీ ఆగట్లేదు కదా... నీకున్న సంకుచిత భావాల్ని నామీద respectకి ఎందుకు ముడిపెట్టి దూరమై అలా దూరమవడాన్ని ఇలాంటి ఫూలిష్ కారణాలతో జస్టిఫై చేసుకుంటావు?
మనిషి ముఖ్యం.. ఇది ఫస్ట్ గ్రహించండి.. మనిషి మన స్వంతం అనుకుంటే ఆ మనిషికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి.. వాడిష్టమొచ్చినట్లు వాడు బిహేవ్ చేస్తాడు... నువ్వు ఓ కారణం వల్ల గౌరవం ఏర్పరుచుకుని అతను ఇకపై మొత్తం నీ ఆలోచనలకు నచ్చినట్లే ఉండాలంటే ఎలా? నీ చుట్టూ ఉన్న మనుషుల్ని ఇలా బలమైన స్వార్థపు తాళ్లతో నీ కంట్రోల్‌లో పెట్టుకోవాలని చూసి.. వాళ్లు నీకు నచ్చనట్లు ప్రవర్తిస్తే నీకేదో అన్యాయం చేసినట్లు ఫోజులు కొడుతూ దూరమవుతావా.. ఇవేం రిలేషన్లు.. కొద్దిగా మారొద్దా మనం?
- నల్లమోతు శ్రీధర్
Sridhar Nallamothu

Post a Comment

Whatsapp Button works on Mobile Device only